పవన్ కళ్యాణ్. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని తెలుగు కథానాయకుడి పేరిది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆరంభం వసూళ్లు అదుర్స్ అనిపించేలా ఉండడం పవన్ సినిమాకి మాత్రమే సాధ్యం అంటుంటారు ట్రేడ్ విశ్లేషకులు. అలాంటి పవన్ తో మూవీ అంటే ఏ దర్శకుడికైనా అది గోల్డెన్ ఆఫర్ గానే ఉంటుంది. ఇప్పుడు ఆ ఫీల్ తోనే ఉన్నాడు యువ దర్శకుడు సంపత్ నంది.
ఈ యంగ్ డైరెక్టర్ అతి త్వరలో పవన్ హీరోగా 'గబ్బర్ సింగ్ 2'ని రూపొందించనున్నాడు. ఈ సినిమాతో తనకు హ్యాట్రిక్ విజయం దక్కుతుందని సంపత్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వరుణ్ సందేశ్ తో తీసిన 'ఏమైందీ వేళ', రామ్ చరణ్ తో తీసిన 'రచ్చ' సినిమాలు తనకు వరుసగా రెండు విజయాలు అందిస్తే. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీస్తున్న 'గబ్బర్ సింగ్ 2' తనకు హ్యాట్రిక్ నిచ్చే సినిమాగా నిలుస్తుందని ధీమాని వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు.. పవన్ సాయంతో తనకు ఆ హ్యాట్రిక్ అత్యంత సులువుగా సొంతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడట ఈ యంగ్ టాలెంటెడ్.
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.