A rumour made 10,000 people fools

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjTpENgv2BcspW2oiJUPljS_UIy1D976MWsuCyki8Kajyed7rCNWz-n6ZVsThzAorJ0UvZX16mIhNT-PnUaC-mQeIwlJzInvU3geSlvG0wC5xCaAv68m2Er2HwwMT1dPKDzVkoK1YmwIM0/s1600/India-Post-logo.png
 

పొతే యాభై, వస్తే కోట్లు….. అంటే ఇదేమీ లాటరీ కాదు. అచ్చంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకత్వానికి నిదర్శనం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోనూ, జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు పేద ప్రజలు పోస్టాఫీసుకు వెళ్ళి పొదుపు ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. గత వారం రోజుల్లో ఏకంగా పదివేల చిలుకు అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. పోస్టాఫీసులో డబ్బులు దాచుకోవచ్చన్న సంగతే చాలామందికి తెలియదు. అలాంటిది ఒకే సారి ఒక్క జిల్లాలోనే అన్ని అకౌంట్లు ఓపెన్ అవ్వడానికి కారణం ఎంటా అని అనుకుంటున్నారా…, వదంతులు. అవును తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు ఒక పుకారు విపరీతంగా షికారు చేస్తుంది. పోస్టాఫీసులో యాభై రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తే, గాలి జనార్ధన రెడ్డి అక్రమాస్తులు, సత్యసాయి ట్రస్ట్ ఆస్థులు, జగన్ ఆస్థులు ను పేదలుకు ఈ అకౌంట్ లా ద్వారా పంచేస్తారని వదంతులు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఇంకే, అమాయక జనం పోస్టాఫీసులు ముందు బారులు తీరి క్యూలు కట్టారు. పొతే యాభై రూపాయలు…, వస్తే అక్రమార్కుల ఆస్థులు కోట్లు వచ్చి వారి అకౌంట్ లో పడిపోతాయన్న అత్యాశతో గంటల సమయం పోస్టాఫీసులు ఎదుట నుంచోని అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు.

0 comments:

Post a Comment

 
Top