FiGht Against Tobacco

 పొగాకును జయిద్దాం
కొందరికి
 అదే జీవితం... ఎన్ని హెచ్చరికలున్నాఎంత డబ్బు ఖర్చయినా దాన్ని మానలేరుమానేద్దామనుకున్నావీలుకాని పరిస్థితి నరకకూపమే పొగాకుప్రతిరోజూ కొత్తగా  కూపంలోకి దిగేవారి సంఖ్య ఎక్కువేచిన్నవయసులో స్టయిల్ కోసమోసహచరుల ప్రభావం వల్లనో సరదాగా మొదలయ్యే  అలవాటు చివరికి వ్యసనమైజీవితాన్నే హరించివేస్తుందిప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిసంవత్సరం మే నెల 31 తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేకదినంగా గుర్తించింది సందర్భంగా పొగాకును ఎలా జయించొచ్చో చూద్దాం.
ప్రపంచ
 ఆరోగ్య సంస్థం గణాంకాల ప్రకారం ప్రతి ఏటా పొగాకు వాడకం వల్ల 60 లక్షల మంది మృత్యువాతపడుతున్నారుఅంటే దాదాపుగా ప్రతి ఆరు సెకన్ల కాలంలో ఒకరు ప్రాణాలు విడుస్తున్నారువీరంతా ప్రత్యక్షంగాపొగాకు వ్యసనానికి బానిసలైనవారేపరోక్షంగా పొగ పీల్చేవారూ సమానంగా నష్టపోతున్నారువీరిలో చిన్నారులుమహిళలు ఎక్కువమందిపీల్చే ప్రతి సిగరెట్టు సదరు మనిషిజీవిత కాలం నుంచి ఏడు నిమిషాల్ని హరించివేస్తుంది. 20 శతాబ్దంలో పొగ తాగడం వల్ల పదికోట్ల మరణాలు సంభవించాయి రీతిలో 21 శతాబ్దంలో వందకోట్లమరణాలు సంభవించగలవని అంచనా!

ఎన్ని
 రసాయనాలో!
పొగాకు
 రూపాలన్నీ అనర్థాలకు దారితీస్తాయిపొగాకు కు నిప్పంటించి పీల్చే పొగలో నాలుగు వేల రకాలరసాయనాలు ఉన్నట్లు శాస్త్ర పరంగా మనకు తెలుస్తోంది రసాయనాల్లో కనీసం అరవై రకాల రసాయనాలుఊపిరితిత్తులకు క్యాన్సర్ను కలుగజేస్తాయి. ‌ 
పొగాకు
 నమలడం వల్ల పెదాలునాలుకబుగ్గల లోపలి భాగం లాంటి అవయవాలకు క్యాన్సర్ సోకుతుందిపెయింట్స్ట్రిప్పర్లలో వాడే అసిటోన్నేల శుభ్రం చేసేందుకు వాడే అమోనియాచీమల మందులో వాడే ఆర్సెనిక్సిగరెట్లైటర్లో ఉండే బ్యూటేన్కారు బ్యాటరీల్లో ఉపయోగించే క్యాడ్మియమ్... ఇంకా కార్బన్ మోనాక్సైడ్మిథనాల్వినైల్క్లోరైడ్ లాంటి హానికర రసాయనాలెన్నో సిగరెట్పొగలో ఉన్నాయిసిగరెట్ తాగడం వల్ల సంభవించే అనారోగ్యాల్లోమొదటిది ఊపిరితిత్తుల క్యాన్సర్. 90 శాతం ఊపితిత్తుల క్యాన్సర్లు సిగరెట్ కారణంగానే సంభవిస్తున్నాయిఊపిరితిత్తుల వ్యాధులైన సిఓపిడితో బాధపడేవారిలో 75 శాతం పొగరాయుళ్లే. ‌ ‌ 
పొగ
 అనర్థాలు
పొగాకు
 వల్ల మన శరీరంలో దుష్ప్రభావం పడని అవయవమంటూ లేదుమెదడు నరాలపై ప్రభావం చూపించడం వల్లపక్షవాతంటొబాకో డిపెండెన్స్ఆంగ్జయిటీ సైకోసిస్ వస్తాయిశుక్లాలు త్వరగా ఏర్పడ తాయివాసన చూడగలిగేలక్షణం తగ్గుతుందిపెదవినాలుకస్వరపేటికలాంటి అవయవాలకు క్యాన్సర్ రావచ్చుగొంతునొప్పిచిగుళ్లవ్యాధులు వస్తాయిఆస్తమాన్యుమోనియాలే కాకుండాఊపిరితిత్తుల క్యాన్సర్కి దారితీస్తుందిగుండె రక్తనాళాల్లోపూడికలుగుండెపోట్లుజీర్ణకోశ వ్యాధులుపేగు క్యాన్సర్ వస్తాయిపురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడంబలహీనతస్త్రీలలో రుతుసమస్యలుసంతానరాహిత్యం వంటి సమస్యలు ఎదురవుతాయిగాయాలుమానకపోవడంరక్తక్యాన్సర్ కూడా రావచ్చుఇలా ఇంకా ఎన్నో జబ్బులున్నాయి. ‌ 
పొగ
 తాగడం మానేశాక
ఒకరోజులో
 గుండెరక్తపోటు కుదుటపడతాయి.
ఒక
 సంవత్సరం తరువాత - గుండెజబ్బు సోకే తత్వం 50 శాతం తగ్గిపోతుంది.
5-15 ఏళ్ల తరువాత - పక్షవాతం సోకే అవకాశాలు తగ్గిపోతాయి.
10 సంవత్సరాల తరువాత - ఊపిరితిత్తుల క్యాన్సర్ అవకాశం తగ్గుతుంది.
ఇలా
 మానొచ్చు
పొగాకు మానేయాలనుకున్నామానేయలేకపోవడం చాలా తరచుగా ఎదురయ్యే సమస్యదీనికిపరిష్కారాలున్నాయిఅన్నింటికన్నా ముందు వ్యక్తి దృఢనిర్ణయంఇది లేనిదే ఎటువంటి వైద్య సహాయం కూడాముందుకు సాగదుఇందుకోసం ఇలా చేయండి.

మీరు మానేయాలనుకుంటున్నారని పదిమందిలో చెప్పండి.
నెమ్మదిగా మానేద్దాంలే అనుకోవడం పొరపాటు.
సిగరెట్ మానేశాక సంభవించే మార్పులలో కొన్ని ఆరోగ్యంలో ఒడిదుడుకులను కలిగించవచ్చుఅటువంటిసమయంలో తాత్కాలికంగా నికోటిన్ ప్యాచ్గమ్ వంటివి ఉపయోగించవ చ్చు.

మీకు ఎదురయ్యే ఇబ్బందుల్ని మీలాగా ఎదుర్కొనే మరొకరితో పంచుకోండి.

డాక్టర్ కృష్ణమోహన్,
కన్సల్టెంట్
 మెడికల్ అంకాలజిస్ట్బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్హైదరాబాద్,
హెల్ప్
 ‌లైన్ : 99895 24365


Click here To Read more: http://www.swarooptheking.net/2011/06/fight-against-tobacco.html#ixzz1VUkttCBO

0 comments:

Post a Comment

 
Top