మాజీ ప్రభుత్వ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ గురువారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా చికెన్ గున్యాతో బాధపడుతున్న ఆయన్న ఈరోజు మధ్యాహ్నం మృతి చెందారు. బ్యూరోక్రాట్‌లలో అత్యంత నిజాయితీపరుడుగా పేరు తెచ్చుకున్నారు. శంకరన్ ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న సమయంలో భూ సంస్కరణ అమలులో కీలక పాత్ర పోషించారు. పేదల కోసం, గిరిజనుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు.

శంకరన్ నక్సలైట్లతో ప్రభుత్వం జరిపిన చర్చల విషయంలో ప్రాధాన ప్రాత పోషించారు. 1987లో నక్సల్స్ కిడ్నాప్ చేసిన 16 మంది అధికారుల్లో శంకరన్ ఒకరు. ఆహార హక్కుపై సుప్రీంకోర్టు నియమించిన సంఘానికి కమిషనర్‌గా పనిచేశారు. పౌర హక్కుల సంఘంలో చురుగ్గా పనిచేశారు. నీతి నిజాయితే లక్ష్యంగా ఆయన జీవించారు. పెళ్లి చేసుకుంటే కుటుంబ పరంగా ఎక్కడ స్వార్ధం పెరుగుతుదనే ఉద్దేశంతో శంకరన్ వివాహం చేసుకోలేదు.

శంకరన్ అనగానే అందరూ గౌరవించే వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు. వార్తలకెక్కడం ఇష్టం లేని ఆయన ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా పనిచేశారు.

0 comments:

Post a Comment

 
Top