రోబో ఘన విజయంతో మరోసారి సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ గా రజనీకాంత్‌ ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు..ఏమి కమిట్ అయ్యారు అంటే హరా రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంతకీ హరా అనేది రజనీ కి కొత్త ప్రాజెక్టేమీ కాదు. చాలా కాలంగా నిర్మాణం జరుపుకుంటున్న సుల్తాన్ దివారియర్. రజనీ తొలి యానిమేషన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంకి టైటిల్ ని హరా గా మార్చి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి సాధారణ రజనీకాంత్ కాగామరొకటి అవతార్ తరహాలో ఉండే యానిమేషన్ పాత్ర.

రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం కోసం రజనీ విదేశాలలో నటించిన సన్నివేశాలను యానిమేషన్ ద్వారా రూపొందించారు. ఈ చిత్రంలో రజనీకి జంటగా చెన్నై28 చిత్రం ఫేమ్ విజయలక్ష్మిహీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ హరా చిత్రంలో రజనీకాంత్ నటించే నిజ సన్నివేశాలు 30 నిమిషాల పాటు చోటు చేసుకోనున్నాయి. ఈసన్నివేశాలను తెరకెక్కించే బాధ్యతను ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్‌కు అప్పగించారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్ విద్యాబాలన్ నటించనున్నట్లు సమాచారం.

0 comments:

Post a Comment

 
Top