ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధం మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎందుకో ఏమిటో చెప్పలేను కానీ
కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాల
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నది

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పెవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందని


ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ మన బంధం మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

*********************************


Sad version

సంగీతం : శివరామ్ శంకర్
సాహిత్యం : భాషాశ్రీ
గానం : కార్తీక్ , శ్రేయా ఘోషాల్



ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా వేధించి వెళ్ళేటందుకు నేనెవరూ
వింతగా ఉందసలు గుండెలో ఈ సెగలు
దేనికో నీపైనే ఉంటొంది నా ధ్యాశసలు
వినిపిస్తే నీ స్వరము కళ్ళల్లో కలవరము
ఇది ప్రేమంటారో ఏమంటారో ఏమిటో
బాధించే ఈ క్షణము కాదంటు శాశ్వతము
నను ఓదార్చి మైమరపిస్తోంది ప్రాణము

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా వేధించి వెళ్ళేటందుకు నేనెవరూ

నీడలా నడిచిన స్నేహం దారి చూపమంటే
నిలిచాను రాతి బొమ్మనై
గాలిలా నీరులా సాగే బాటసారి నేను
కలిసావే తీరమల్లే నాకు

ప్రియమైన మోహమో మౌనమా విప్పవే పెదవి్నీ
నా పలుకుల భావమే ప్రేమనీ చెప్పవే అతనికీ

0 comments:

Post a Comment

 
Top